liver: కాలేయం డ్యామేజ్ కాకుండా వుండాలంటే.. ఈ ఐదింటినీ దూరం పెట్టాల్సిందే

5 foods that silently kill the health of your liver

  • రిఫైన్డ్ షుగర్, ఆల్కహాల్ తో కాలేయంపై అధిక శ్రమ
  • రెడ్ మీట్, ఫాస్ట్ ఫుడ్స్ ను జీర్ణం చేసుకోవడం కష్టం
  • మైదా పిండితోనూ నష్టమే

గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఎలానో.. మనం జీవించి ఉండేందుకు కాలేయం కూడా అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. కాలేయం దెబ్బతినడం వల్ల చిన్న వయసులోనే మరణిస్తున్న వారు కూడా ఉన్నారు. కాలేయం మన శరీరంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీ అని అనుకోవచ్చు. మనం ఏది తిన్నా, ఏది తాగినా మొదట ప్రాసెస్ చేసేది కాలేయమే. మనం ప్రాణంతో జీవించి ఉండాలంటే, మనకు శక్తి కావాలంటే అందుకు తినడం, తాగడం తప్పనిసరి. ఎంతో ముఖ్యమైన కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే, దానికి హాని చేసే కొన్ని పదార్థాలు, పానీయాలను మనం దూరం పెట్టాల్సిందే.

రిఫైన్డ్ షుగర్
ప్రాసెస్ చేసిన చక్కెర వల్ల ఉపయోగాలకంటే నష్టాలే ఎక్కువ. చాలా పరిమిత మోతాదుతో నష్టం ఉండదు. ఆ నష్టాన్ని ఎక్కువ కాకుండా చూసుకోవాలి. పండ్లు, నట్స్, డ్రై ఫ్రూట్స్ లో చక్కెరలు సహజంగానే ఉంటాయి. ప్రాసెస్డ్ షుగర్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉన్నవి తీసుకుంటే కాలేయానికి నష్టం జరుగుతుంది. కూల్ డ్రింక్స్, సోడాలు, కుకీలు, క్యాండీల వల్ల కాలేయంలో కొవ్వు పెరిగిపోయి ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఆల్కహాల్
ఆల్కహాల్ చాలా తక్కువ మోతాదులో తీసుకుంటే కాలేయంపై పెద్దగా భారం పడదు. మోతాదు మీరితే దాన్ని ప్రాసెస్ చేయడం కోసం కాలేయం చాలా శ్రమించాల్సి వస్తుంది. ఆల్కహాల్ రూపంలో అధిక కేలరీలు శరీరంలో చేరి కాలేయంలోనే కొవ్వులుగా పేరుకుపోతాయి. ఆల్కహాల్ లో ఉన్న కెమికల్స్ ను విచ్ఛిన్నం చేసేందుకు కాలేయం ప్రయత్నించినప్పుడు కాలేయ కణాలకు నష్టం జరుగుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అది ఫైబ్రోసిస్, ఇన్ ఫ్లమ్మేషన్ కు దారితీస్తుంది. లివర్ సిర్రోసిస్, జాండిస్ కు కారణం కావచ్చు.

రెడ్ మీట్
రెడ్ మీట్ లో ప్రొటీన్ చాలా అధికంగా ఉంటుంది. దీన్ని జీర్ణం చేయడం కాలేయానికి శక్తికి మించిన పని. దీని కారణంగా కాలేయానికి సమస్యలు ఏర్పడతాయి. గొడ్డు మాంసం, పంది మాంసం, మేక మాంసాన్ని రెడ్ మీట్ గా పరిగణిస్తారు.

మైదా పిండి
మైదాతో తయారు చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మైదాలో ఎలాంటి పోషకాలు ఉండవు. వీట్ ను ప్రాసెస్ చేయగా మిగిలేది మైదా. అధిక కార్బోహైడ్రేట్స్ వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుంది. కనుక మైదాతో చేసే బజ్జీలు, బిస్కట్లు, సమోసా, పిజ్జా, పాస్తా, బ్రెడ్ తినొద్దు. 

ఫాస్ట్ ఫుడ్
శాచురేటెడ్ ఫ్యాట్ ఫాస్ట్ ఫుడ్స్ లో ఎక్కువగా ఉంటుంది. జీర్ణానికి కష్టమైనది ఇది. బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, వేఫర్లు, నూడుల్స్ తదితర ఫాస్ట్ ఫుడ్ తినొద్దు. ఇవి కాలేయానికి, జీవక్రియలకు నష్టం కలిగిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ రిస్క్ అధికమవుతుంది.

  • Loading...

More Telugu News