Prabhas: ఆదిపురుష్ అప్​డేటెడ్ టీజర్ వచ్చేసింది

Adipurush Updated teaser

  • వీఎఫ్ఎక్స్ మెరుగు పరిచి విడుదల
  • ఓం రౌత్ దర్శకత్వంలో రాముడిగా నటించిన ప్రభాస్
  • జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’పై భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందించిన చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా సీత పాత్ర చేస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్ర పోషించారు. ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. 

గతంలో విడుదలైన టీజర్ లో గ్రాఫిక్స్ పై అభిమానులు పెదవి విరవడంతో చిత్ర బృందం మరోసారి విజువల్ ఎఫెక్ట్స్ పై దృష్టి సారించింది. దాంతో, సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. తాజాగా వీఎఫ్ ఎక్స్ మార్పులు చేసిన టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా హిందీ, తెలుగుతో పాటు పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16 విడుదల కానుంది. చిత్ర బృందం ప్రమోషన్స్ కోసం రెడీ అవుతోంది.

More Telugu News