nani movie: ఈ నెలలోనే ఓటీటీలో 'దసరా' స్ట్రీమింగ్

Nani Movie Dasara To Be Stream From April 27th On Netflix

  • నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ
  • రూ.22 కోట్లకు డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్
  • ఈ నెల 27 నుంచి ప్రసారం చేయనున్నట్లు సమాచారం

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ దసరా ఈ నెలలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 30న థియేటర్లలో విడుదలైన దసరా.. వంద కోట్ల వసూళ్లను రాబట్టింది. నాని, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం నెట్ ఫ్లిక్స్ సుమారు రూ.22 కోట్లను వెచ్చించినట్లు సమాచారం.

ఈ సినిమాను తొలుత మే 30న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ నెల 27 నుంచే ఓటీటీలో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటన చేయనుంది. ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఇందులోని చమ్కీల అంగిలేసి సాంగ్ చార్ట్‌ బస్టర్‌ గా నిలిచిన సంగతి తెలిసిందే!

More Telugu News