Kotla Sujathamma: జయరాంకు నారా లోకేశ్ కాదు.. నేను సవాల్ విసురుతున్నా: కోట్ల సుజాతమ్మ

Kotla Jayaram challenge to Jayaram

  • మంత్రి జయరాం పై విమర్శలు గుప్పించిన లోకేశ్
  • ఐటీ నోటీసులపై సమాధానం చెప్పాలన్న కోట్ల సుజాతమ్మ
  • జయరాంకు రాజకీయ భిక్ష పెట్టిందే టీడీపీ అని వ్యాఖ్య

టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర ఈరోజు ఆదోని నియోజకవర్గంలోకి ప్రవేశిస్తోంది. మరోవైపు నిన్న ఆయన ఆలూరు నియోజకవర్గంలో తన పాదయాత్ర సందర్భంగా మంత్రి జయరాం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. భూకబ్జాలు, సెటిల్మెంట్లలో జయరామ్ మునిగితేలుతున్నారని ఆరోపించారు. ఐటీ ఇచ్చిన నోటీసులపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు.

 దీనిపై ఆలూరు టీడీపీ ఇన్ఛార్జీ, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ స్పందిస్తూ... లోకేశ్ విసిరిన సవాల్ కు జయరాం విచిత్రమైన సమాధానాలు ఇస్తున్నారని అన్నారు. జయరాంకు లోకేశ్ బాబు కాకుండా, తాను సవాల్ విసురుతున్నానని... ఐటీ ఇచ్చిన నోటీసులకు జయరాం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జయరాం పేకాట స్థావరాలు, ఇసుక లూటీ, బియ్యం మాఫియా, కర్ణాటక మద్యం దందా గురించి అందరికీ తెలుసని చెప్పారు. జయరాంకు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనే అని అన్నారు. జయరాంను టీడీపీ జెడ్పీటీసీ చేసిందని... ఆయన వేరే పార్టీలోకి వెళ్లి చేసిందేమీ లేదని విమర్శించారు.

Kotla Sujathamma
TDP
Nara Lokesh
Jayaram
YSRCP
  • Loading...

More Telugu News