Raj Kumar: చిరంజీవిలా ఉండటం నాకు మైనస్ అయింది: రాజ్ కుమార్

Raj Kumar Interview

  • చిరంజీవి పోలికలతో కనిపించే రాజ్ కుమార్ 
  • ఆయనలా ఉన్నానని అంటే గర్వంగా ఉండేదని వెల్లడి
  • చిరంజీవి అదృష్టం .. ఆయన స్థాయి వేరని వ్యాఖ్య 
  • తాను వెనకబడిపోవడానికి అదో కారణమైందని వివరణ  

చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అప్పట్లో ఆయన పోలికలు ఉన్నవారిని కూడా జనాలు ప్రత్యేకంగా చూసేవారు. అలా అక్కడక్కడా కాస్త చిరంజీవి పోలికలతో రాజ్ కుమార్ కనిపించేవారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో కలుపుకుని 74 సినిమాలు చేశాను. వాటిలో 27 సినిమాలలో హీరోగా చేశాను" అని అన్నారు.

ఇన్ని సినిమాల్లో చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు వచ్చిందా అంటే .. రాలేదనే చెప్పాలి. అందుకు కారణం నేను చిరంజీవిలా ఉండటమే. చిరంజీవిలా భలే ఉంటాడురా అని ఎవరైనా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఇండస్ట్రీకి వెళ్లిన తరువాత పరిస్థితి వేరుగా ఉంటుంది. చిరంజీవిలాగా ఉంటాము తప్పా, ఆయన అదృష్టానికీ .. స్థాయికి మనము ఎక్కడా సరిపోము" అని చెప్పారు. 

"అప్పట్లో నాతో పాటు శ్రీకాంత్ .. తమిళంలో విక్రమ్ .. ఆనంద్ .. అజిత్ ఇలా ఒక ఏడెనిమిది మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చాము. అందరికంటే ముందుగా నా కెరియర్ మొదలైంది. ఆ తరువాత వాళ్లంతా నన్ను దాటేసి ముందుకు వెళ్లిపోయారు. అందుకు కారణం ఏమిటంటే నేను చిరంజీవిలా ఉండటం. నా స్థాయికి తగినట్టుగా నేను చేసినా, చిరంజీవిగారితో పోల్చడం" అంటూ చెప్పుకొచ్చారు. 

Raj Kumar
Chiranjeevi
Tollywood
  • Loading...

More Telugu News