Raghu Rama Krishna Raju: కోడికత్తి, బాబాయ్ హత్య అని చెప్పి మేము ఎన్నికల్లో గెలిచాం: రఘురామకృష్ణరాజు

raghu raju fires on Jagan

  • జగన్ వంద మంది సలహాదారులను పెట్టుకున్నారన్న రఘురాజు
  • రాష్ట్రం కోసం జగన్ సొంతంగా ఏం సలహా ఇస్తారని ప్రశ్న
  • డబ్బు లేకపోవడం వల్ల మొన్న బటన్ నొక్కలేదని సీఎస్ చెప్పారని వ్యాఖ్య

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సెటైర్లు వేశారు. వంద మంది సలహాదారులను పెట్టుకున్న జగన్... రాష్ట్ర భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం సొంతంగా ఏం సలహాలు ఇవ్వగలరని ఎద్దేవా చేశారు. ఇంకెన్ని రోజులు పోలవరం, ప్రత్యేకహోదా అంటూ కాలం గడుపుతారని ప్రశ్నించారు. వివేకా బాబాయ్ హత్య, కోడికత్తి అంటూ అబద్ధాలు చెప్పి గత ఎన్నికల్లో తమ వైసీపీ పార్టీ గెలిచిందని అన్నారు. డబ్బులు లేకపోవడం వల్లే మొన్న జగన్ బటన్ నొక్కలేదని, బాలినేనితో నొక్కించారని సీఎస్ జవహర్ రెడ్డి అన్నారని చెప్పారు.

Raghu Rama Krishna Raju
Jagan
YSRCP
  • Loading...

More Telugu News