Tollywood: సౌత్ ఇండస్ట్రీపై మరోసారి నోరు పారేసుకున్న తాప్సీ

Taapsi comments on south film indusrty

  • దక్షిణాదిలో చేసిన చిత్రాలతో తనకు ఎలాంటి గుర్తింపు రాలేదని వ్యాఖ్య
  • అక్కడ నటిగా సంతృప్తే దొరకలేదన్న హీరోయిన్ 
  • అందుకే బాలీవుడ్ కు వెళ్లిపోయానన్న తాప్సీ 

‘ఝుమ్మందినాదం’ చిత్రంతో తెరంగేట్రం చేసిన తాప్సీ  అప్పట్లో తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో వరుసగా చిత్రాలు చేసినా స్టార్ డమ్ తెచ్చుకోలేకపోయింది. ఈ క్రమంలో బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఆమెకు అక్కడ వరుస విజయాలు దక్కాయి. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిన ఆమె తనకు నటిగా అవకాశం ఇచ్చిన దక్షిణాది చిత్ర పరిశ్రమపై నోరు పారేసుకుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటించిన సినిమాలతో తనకు ఎలాంటి గుర్తింపు, స్టార్‌డమ్ రాలేదని చెప్పింది. నటిగా అక్కడ సంతృప్తే దొరకలేదని, అందుకే బాలీవుడ్ వైపు వచ్చేశాననని తెలిపింది. 

అమితాబ్‌ బచ్చన్ తో కలిసి ‘పింక్’ చిత్రం చేయడంతో తన సినీ జీవితం గొప్ప మలుపు తిరిగిందని చెప్పింది. బాలీవుడ్ ను పొగిడే క్రమంలో సౌత్ ఇండస్ట్రీని చులకన చేసిన తాప్సీపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీని, తనను పరిచయం చేసిన   దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని అందుకున్న సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ ఇలా మాట్లాడటం తగదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Tollywood
south industry
Taapsee
Bollywood
comments
  • Loading...

More Telugu News