Navadeep: 'న్యూసెన్స్' నుంచి లిరికల్ సాంగ్ .. 'ఆహా'లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Newsense WebSeries Lyrical Song Released

  • విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'న్యూసెన్స్'
  • ప్రధానమైన పాత్రలను పోషించిన నవదీప్ - బిందుమాధవి 
  • సంగీతాన్ని సమకూర్చిన సురేశ్ బొబ్బిలి 
  • మే 12వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్

నవదీప్ - బిందుమాధవి జంటగా 'న్యూసెన్స్' వెబ్ సిరీస్ నిర్మితమైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ లో, జర్నలిస్ట్ గా నవదీప్ .. టీవీ రిపోర్టర్ గా బిందుమాధవి నటించారు. శ్రీప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. 

"హే మైనేరు పిలగాడా .. వరకంట సూడవేమి? నీ ఎనక నడిసే నీడే నేనేరా" అంటూ ఈ పాట సాగుతోంది. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి పెంచల్ దాస్ సాహిత్యాన్ని అందించగా, హరితేజ ఆలపించింది. హీరో .. హీరోయిన్ పై చిత్రీకరించిన పాట ఇది. 

కొన్ని రోజులుగా ఈ వెబ్ సిరీస్ ను గురించిన పబ్లిసిటీని 'ఆహా'వారు ఒక రేంజ్ లో చేస్తున్నారు. దాంతో ఈ వెబ్ సిరీస్ కోసం అంతా కూడా ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. మే 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు 'ఆహా'వారు ఎనౌన్స్ చేశారు. ఈ వెబ్ సిరీస్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

More Telugu News