Pavan Kalyan: పవన్ సినిమా షూటింగుకి ప్రియాంక అరుళ్ మోహన్!

Sujeeth movie Update

  • పవన్ హీరోగా సినిమా చేస్తున్న సుజీత్
  • డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా ఇది  
  • ముంబైలో జరుగుతున్న షూటింగు 
  • హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్

పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్ గా చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కొంతమందికి ఆ కల త్వరగా నిజమవుతుంది .. మరికొందరికి చాలా సమయం పడుతుంది. అయితే తెలుగులో రెండు ఫ్లాపులతో వెనుకబడిన హీరోయిన్ కి ఇక్కడి నుంచి ఛాన్స్ వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఆ హీరోయిన్ పేరే ప్రియాంక అరుళ్ మోహన్.

'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమాతో ప్రియాంక అరుళ్ మోహన్ టాలీవుడ్ కి పరిచయమైంది. చక్కని కనుముక్కు తీరుతో ఈ సుందరి ఇక్కడి కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేసింది. చందమామలాంటి ఈ బ్యూటీ ఇక్కడ హవా కొనసాగించడం ఖాయమని అనుకున్నారు .. కానీ అలా జరగలేదు. 'శ్రీకారం' సినిమాతో మరో ఫ్లాప్ ఆమె ఖాతాలో పడిపోయింది. 

అలా తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. 'డాక్టర్' సినిమాతో భారీ హిట్ ను అందుకున్న ప్రియాంక, అక్కడ తన జోరు చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్ - సుజీత్ కాంబినేషన్లోని సినిమా నుంచి ఆమెకి ఛాన్స్ వెళ్లింది. డీవీవీ దానయ్య నిర్మాణంలో ముంబైలో జరుగుతున్న ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ లో ఆమె జాయిన్ అయింది. ఆమెకి వెల్ కమ్ చెబుతూ ఈ సినిమా టీమ్ పోస్టర్ ను వదిలింది.

More Telugu News