Allu Arjun: 'గంగమ్మ జాతర'తో 'పుష్ప 2' కథను లింక్ చేసిన సుకుమార్?

Pushpa 2 movie update

  • అందరిలో ఆసక్తిని పెంచిన 'పుష్ప 2' పోస్టర్ 
  • బన్నీ ధరించినది 'మాతంగి' వేషమని వెల్లడి 
  • తిరుపతి 'గంగమ్మ జాతర' నేపథ్యంలో సాగే సీన్ 
  • ఇది సినిమాలో హైలైట్ గా నిలిచే ఎపిసోడ్

అల్లు అర్జున్ అభిమానులంతా ఇప్పుడు 'పుష్ప 2' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఫస్టు పార్టుకి పాన్ ఇండియా స్థాయిలో రెస్పాన్స్ రావడంతో, సెకండ్ పార్టుపై మరింతగా అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ పోస్టర్ ఒకటి వదిలారు. ఈ పోస్టర్ అందరిలో ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. ఎక్కడ చూసినా ఈ పోస్టర్ గురించిన చర్చలే నడుస్తున్నాయి. 

ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ నీలంరంగు మేకప్ లో .. చీరకట్టుకుని, పూలు .. ఆభరణాలు ధరించి ఉన్నాడు. చేతికి గాజులు ధరించగా .. మెడలో నిమ్మకాయల దండ కనిపిస్తోంది. ఆవేశంతో ఆయన కనిపిస్తున్న ఈ వేషధారణ 'మాతంగి' అనే గ్రామదేవతకి సంబంధించినదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతిలో వారం రోజుల పాటు జరిగే 'గంగమ్మ జాతర'లో ఒక రోజున అమ్మవారు 'మాతంగి'గా దర్శనమిస్తుంది.  

ఒకప్పుడు తిరుపతి ప్రాంతంలో పాలెగాళ్ల అరాచకాలు ఎక్కువగా ఉండేవి. గంగమ్మతల్లి వాళ్ల దురాగతాలకు చరమగీతం పాడిందని అక్కడి చరిత్ర చెబుతోంది. 'పుష్ప 2' కథ కూడా తిరుపతి ప్రాంతంలోనే నడుస్తూ ఉంటుంది. 'గంగమ్మ జాతర'తో 'పుష్ప 2'కథను సుకుమార్ ఎలా ముడిపెట్టి ఉంటాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే ఈ సినిమాలో 'గంగమ్మ జాతర ఎపిసోడ్ హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది.

More Telugu News