Pokuri Babu Rao: రాజశేఖర్ హీరోగా పనికిరాడన్నది నేనే: నిర్మాత పోకూరి బాబూరావు

Pokuri Babu Rao Interview

  • 'నవభారతం' అలా పట్టాలెక్కిందన్న బాబూరావు  
  • 'అన్న' సినిమా కమర్షియల్ హిట్ కొట్టిందని వెల్లడి 
  • రాజశేఖర్ తో స్నేహాన్ని గురించిన ప్రస్తావన

అభిరుచి కలిగిన నిర్మాతగా పోకూరి బాబూరావుకి మంచి పేరు వుంది. టి.కృష్ణ .. ముత్యాల సుబ్బయ్య వంటి వారితో ఆయన మంచి హిట్స్ తీశారు. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. పరుచూరి బ్రదర్స్ నాకు 'ప్రజాస్వామ్యం' వంటి హిట్ ఇచ్చారు. కాకపోతే ఆ రోజుల్లో వాళ్లు చాలా బిజీ. వాళ్లని కలుసుకుని మాట్లాడటమే కష్టంగా ఉండేది" అన్నారు.

"అలాంటి పరిస్థితుల్లో మరుధూరి రాజా ఒక కథను రెడీ చేసుకుని తీసుకొచ్చాడు. ఆ కథలో ఏయే మార్పులు చేయాలనేది పరుచూరి బ్రదర్స్ చెప్పారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఆ సినిమా బాగా ఆడింది. ఆ తరువాత రాజశేఖర్ తో చేసిన 'అన్న' సినిమా, ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ కథకి ముందుగా బాలకృష్ణగారిని అనుకున్నాము గానీ, ఆయన వరకూ వెళ్లలేదు" అని చెప్పారు.  

ఇండస్ట్రీలో నేను ఎక్కువగా అభిమానించే హీరో రాజశేఖర్ గారు. ఒక హీరోకి .. నిర్మాతకి మధ్య ఉండే అభిమానానికి మించి మా స్నేహం ఉండేది. మొదట్లో అసలు రాజశేఖర్ హీరోగానే పనికిరాడు .. ఆయనను ఎలా తీసుకోవడం అని అన్న నేనే, ఆ తరువాత ఆయనతోనే వరుస సినిమాలు నిర్మించాను. అప్పుడప్పుడు అలకలు ఉన్నా మా స్నేహం అలాగే ఉంది" అంటూ నవ్వేశారు. 

Pokuri Babu Rao
Rajasekhar
Paruchuru Brothers
  • Loading...

More Telugu News