Prabhas: 'సలార్' కి ఇక గుమ్మడికాయ కొట్టేస్తారట!

Salaar Movie Update

  • షూటింగు దశలో ప్రభాస్ 'సలార్'
  • భారీ మాస్ యాక్షన్ నేపథ్యంలో సాగే కథ 
  • హైదరాబాదులో జరుగుతున్న చివరి షెడ్యూల్ 
  • సెప్టెంబర్ 28వ తేదీన విడుదల
  • లైన్లో 'ప్రాజెక్టు K' .. 'రాజా డీలక్స్'  


ప్రభాస్ అభిమానులంతా ఇప్పుడు 'సలార్' సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇటీవల ఇటలీలోని 'మటేరా' ప్రాంతంలో చిత్రీకరించారు. ఈ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. 

ఇక తాజా షెడ్యూల్ షూటింగు హైదరాబాదులో మొదలైనట్టుగా సమాచారం. ఇక్కడ ఈ షెడ్యూల్ షూటింగు 9 రోజుల పాటు జరుగుతుందని అంటున్నారు. ఆ తరువాత ఇక కొబ్బరికాయ కొట్టేస్తారట. భారీ మాస్ యాక్షన్ తో రూపొందుతున్న ఈ సినిమాకి, హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ పనిచేశారు. 

ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, జగపతిబాబు .. పృథ్వీ రాజ్ సుకుమారన్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ 'ప్రాజెక్టు K' .. 'రాజా డీలక్స్' చేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News