Rohit Sharma: మేం వచ్చేసినాము... ఎంఐ ఫ్యాన్స్ పదండి ఉప్పల్ కు!: తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ

Rohit Sharma speaks Telugu in Hyderabad airport

  • నేడు ఐపీఎల్ లో సన్ రైజర్స్ × ముంబయి ఇండియన్స్
  • హైదరాబాద్ చేరుకున్న ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లు
  • ఎయిర్ పోర్టులో రోహిత్ శర్మ తెలుగు సందేశం
  • వీడియో పంచుకున్న ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ

ఐపీఎల్ లో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ మ్యాచ్ కోసం ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లు హైదరాబాద్ చేరుకున్నారు. 

ఎయిర్ పోర్టులో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడాడు. "మేం వచ్చేసినాము... ఎంఐ (ముంబయి ఇండియన్స్) ఫ్యాన్స్ పదండి ఉప్పల్ కు" అంటూ రోహిత్ శర్మ తెలుగులో తన సందేశం వినిపించాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో విడుదల చేసింది. 

కాగా, రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ శర్మ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే. ఆమె స్వస్థలం విశాఖపట్నం. మహారాష్ట్రకు చెందిన గురునాథ్ శర్మను వివాహం చేసుకున్న తర్వాత ముంబయిలో స్థిరపడ్డారు.

Rohit Sharma
Telugu
Mumbai Indians
Sunrisers Hyderabad
IPL

More Telugu News