Balakrishna: 100 డేస్ సెలబ్రేషన్స్ దిశగా 'వీరసింహా రెడ్డి'

Veerasimha Reddy 100 Days Celebrations

  • జనవరి 12వ తేదీన విడుదలైన 'వీరసింహారెడ్డి'
  • అన్ని ప్రాంతాల్లో తొలిరోజునే దక్కిన హిట్ టాక్ 
  • త్వరలో 100 రోజులను పూర్తిచేసుకోనున్న సినిమా 
  • ఈ నెల 23వ తేదీన జరగనున్న ఫంక్షన్    


బాలకృష్ణ కథానాయకుడిగా 'వీరసింహారెడ్డి' సినిమా తెరకెక్కింది. మైత్రీ బ్యానర్లో గోపీచంద్ మలినేని ఈ సినిమాను రూపొందించాడు. ఫ్యాక్షన్ నేపథ్యంలో నడిచే ఈ కథలో బాలకృష్ణ తండ్రీ కొడుకులుగా కనిపిస్తారు. ఈ రెండు పాత్రల మధ్య గల వైవిధ్యాన్ని దర్శకుడు గొప్పగా ఆవిష్కరించాడు. 

ఈ సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల రోజునే ఈ సినిమా హిట్ టాక్ ను నమోదు చేసుకుంది. చాలా వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అలాంటి ఈ సినిమా మరో రెండుమూడు రోజుల్లో 100 రోజులను పూర్తిచేసుకోనుంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా 100 డేస్ సెలబ్రేషన్స్ ను ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నట్టు ప్రకటించారు. వేదిక ఎక్కడనేది త్వరలో తెలియజేయనున్నారు. శ్రుతి హాసన్ - హనీ రోజ్ నాయికలుగా అలరించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ .. దునియా విజయ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

More Telugu News