Saitej: సుకుమార్ స్క్రీన్ ప్లే భయపెడుతుంది: 'విరూపాక్ష' గురించి సాయితేజ్

Virupaksha movie team interview

  • సాయితేజ్ హీరోగా రూపొందిన 'విరూపాక్ష'
  • ఈ నెల 21వ తేదీన సినిమా విడుదల 
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్ 
  • ఇది సీరియస్ గా సాగే హారర్ థ్రిల్లర్ అని చెప్పిన సాయితేజ్  


సాయితేజ్ హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో 'విరూపాక్ష' సినిమా రూపొందింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ - సుకుమార్ కలిసి నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సాయితేజ్ - సంయుక్త మీనన్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. 

సాయితేజ్ మాట్లాడుతూ .. ఈ మధ్య కాలంలో అందరూ హారర్  కామెడీ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. అందుకు భిన్నంగా 'విరూపాక్ష' సీరియస్ హారర్ మూవీగా నడుస్తుంది. ఈ హారర్ వెనుక థ్రిల్లింగ్ ఎక్కువగా ఉంటుంది. సుకుమార్ గారి స్క్రీన్ ప్లే మేజిక్ చేస్తుంది. ఎక్కడ కూడా బోర్ కొట్టదు" అన్నాడు. 

"నాకు హారర్ సినిమాలంటే భయం .. కానీ సస్పెన్స్ తో కూడిన హారర్ సినిమాలను ఇష్టపడతాను. నైట్ ఎఫెక్టులో షూటింగు ఉంటే కార్తీక్ ముందుగానే నన్ను ప్రిపేర్ చేసేవాడు. ఈ కథ 1989 .. 90ల్లో జరుగుతుంది. ఈ సినిమా చూస్తుంటే ఆ కాలంలోకి వెళ్లిపోతాం. అంత బాగా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు సెట్ వేశారు" అని చెప్పాడు. 

More Telugu News