Sandra Venkata Veeraiah: రాజకీయాల్లోకి రాకముందు మీ పరిస్థితి ఏమిటో గుర్తుకు తెచ్చుకోండి: పొంగులేటిపై సండ్ర ఫైర్

Sandra fires on Ponguleti

  • ప్రజల కోసం పొంగులేటి చేసిన మంచి పనులు ఏమున్నాయన్న సండ్ర
  • పొంగులేటిని ప్రజలు నమ్మరని వ్యాఖ్య
  • ఇలాంటి నేతల వల్ల పార్టీలు నాశనం అవుతాయని విమర్శ

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తరపున పోటీ చేసే ఏ ఒక్క అభ్యర్థిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ... ప్రజల కోసం పొంగులేటి చేసిన మంచి పనులేమున్నాయని ప్రశ్నించారు. తాము మంచి పనులు చేశాం కాబట్టే ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నామని చెప్పారు. చౌకబారు విమర్శలు చేసే పొంగులేటి వంటి వ్యక్తులను ప్రజలు నమ్మరని అన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నీవు టార్గెట్ చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రెండు జాతీయ పార్టీలు ఆయన కోసం ఎదురు చూస్తున్నాయని పొంగులేటి చెపుతున్నారని... ఆయనే జాతీయ పార్టీల నాయకుల వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. పొంగులేటి వంటి నాయకులతో పార్టీలు నాశనం అవుతాయని విమర్శించారు. రాజకీయాల్లోకి రాకముందు మీ పరిస్థితి ఏమిటో గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు.

Sandra Venkata Veeraiah
KCR
BRS
Ponguleti
  • Loading...

More Telugu News