Raviteja: భారీ నష్టాలు తెచ్చిపెట్టిన 'రావణాసుర'?

Ravanasura movie update

  • ఈ నెల 7న వచ్చిన 'రావణాసుర'
  • ఆశించిన స్థాయిని అందుకోలేకపోయిన సినిమా 
  • నెగెటివ్ కేరక్టర్ దెబ్బకొట్టేసిందన్న ఫ్యాన్స్ 
  • షూటింగు దశలో 'టైగర్ నాగేశ్వరరావు'


రవితేజ నుంచి చాలా తక్కువ గ్యాప్ లో 'ధమాకా' .. 'వాల్తేరు వీరయ్య' సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా చాలా వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాయి. ఆ తరువాత సినిమాగా రవితేజ నుంచి 'రావణాసుర' థియేటర్లకు వచ్చింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఈ సినిమాకి అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరించగా, రవితేజ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. రవితేజకి హ్యాట్రిక్ హిట్ ఖాయమని అంతా ఎదురుచూస్తుండగా ఈ సినిమా ఫ్లాప్ అనిపించుకుంది. 

ఈ సినిమా భారీ నష్టాలను తెచ్చిపెట్టిందనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. రవితేజ కూడా ఈ నష్టాలను పాలుపంచుకోక తప్పదని అంటున్నారు. ఇక రవితేజ నెక్స్ట్ మూవీగా 'టైగర్ నాగేశ్వరరావు' షూటింగు జరువుకుంటోంది. ఈ సినిమాతో రవితేజ తన అభిమానులను ఖుషీ చేస్తాడేమో చూడాలి.

More Telugu News