Chandrababu: ఈరోజు, రేపు కడప జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

Chandrababu going to Kadapa for two days visit

  • రెండు రోజుల పాటు కడపలో సమీక్ష నిర్వహించనున్న బాబు
  • 35 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమీక్ష
  • అనంతరం ప్రకాశం జిల్లాకు పయనం

ఓ వైపు టీడీపీ యువ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రతో బిజీగా ఉండగా... మరొకవైపు పార్టీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాల సమీక్షలతో నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. తన సమీక్షల్లో భాగంగా చంద్రబాబు ఈరోజు కడపకు వెళ్తున్నారు. రెండు రోజుల పాటు కడప జిల్లాలో సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ రోజు కడపలో జోన్-5 సమావేశాన్ని నిర్వహించనున్నారు. 

కడప, ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి అనంతపురం జిల్లాల పరిధిలోని 5 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉన్న 35 అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షను నిర్వహించనున్నారు. రేపు ఉదయం బద్వేలు నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతారు. ఈ సమావేశం పూర్తయిన వెంటనే ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్తారు.

Chandrababu
Telugudesam
Kadapa
  • Loading...

More Telugu News