Allari Naresh: ఆసక్తిని రేకెత్తిస్తున్న 'ఉగ్రం' మేకింగ్ వీడియో!

Ugram Making Video Released

  • విజయ్ కనకమేడల సినిమాగా 'ఉగ్రం'
  • ఆయనతో అల్లరి నరేశ్ చేస్తున్న రెండో సినిమా ఇది 
  • కథానాయికగా మిర్నా పరిచయం 
  • మే 5వ తేదీన సినిమా విడుదల

అల్లరి నరేశ్ హీరోగా 'ఉగ్రం' సినిమా రూపొందింది. వైవిధ్యభరితమైన కథాంశంతో ఈ సినిమా కొనసాగనుంది. హరీశ్ పెద్ది - సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకి, విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు. అల్లరి నరేశ్ జోడీగా ఈ సినిమాతో 'మిర్నా' పరిచయమవుతోంది.

కథ ప్రకారం ఈ సినిమాను రాత్రివేళలో ఎక్కువగా చిత్రీకరించారు. 70 రాత్రులకి పైగా ఈ సినిమా కోసం షూటింగు జరిపినట్టుగా చెప్పారు. 'ఇంటెన్స్ నైట్ షూట్ చాప్టర్ 1' పేరుతో ఈ సినిమా నైట్ షూట్ కి సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. 

విలన్ గ్యాంగ్ పై హీరో విరుచుకుపడటం ఈ మేకింగ్ వీడియోలో ప్రధానంగా కనిపిస్తోంది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, ఇంద్రజ ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. మే 5వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. 'నాంది' హిట్ తరువాత అల్లరి నరేశ్ - విజయ్ కనకమేడల కలిసి చేస్తున్న సినిమా ఇది. మరోసారి హిట్ కొడతారేమో చూడాలి.

More Telugu News