Jagan: విజయవాడలో ఇఫ్తార్ విందుకు హాజరైన సీఎం జగన్

CM Jagan attends Iftar in Vijayawada

  • కొనసాగుతున్న పవిత్ర రంజాన్ మాసం
  • ఏప్రిల్ 22న రంజాన్ పర్వదినం
  • ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

రంజాన్ మాసం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తరఫున విజయవాడ విద్యాధరపురం మినీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ముస్లిం టోపీ, పవిత్ర కండువా ధరించి ముస్లింలతో కలిసి నమాజ్ ఆచరించారు. రంజాన్ సమీపిస్తున్న నేపథ్యంలో, ముస్లింలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 

రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ ప్రార్థించాలని పిలుపునిచ్చారు. మీ అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. దేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నట్టు వివరించారు. 

ఏపీ ప్రభుత్వ ఇఫ్తార్ విందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వంలో మైనారిటీలకు ఎంతో మేలు జరిగిందని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మైనారిటీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. 

గత ప్రభుత్వం మైనారిటీలను పట్టించుకోలేదని అంజాద్ బాషా విమర్శించారు. మైనారిటీ వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఘనత సీఎం జగన్ దేనని కొనియాడారు.

Jagan
Iftar
Ramadan
Vijayawada
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News