Saitej: 'విరూపాక్ష' నుంచి బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్!

Virupaksha movie lyrical song released

  • సాయితేజ్ హీరోగా రూపొందిన 'విరూపాక్ష'
  • అందాల సందడి చేయనున్న సంయుక్త
  • సుకుమార్ స్క్రీన్ ప్లే ప్రధానమైన బలం 
  • ఈ నెల 21వ తేదీన రిలీజ్ కానున్న సినిమా  

సాయితేజ్ హీరోగా 'విరూపాక్ష' సినిమా రూపొందింది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ - సుకుమార్ కలిసి నిర్మించిన ఈ సినిమాకి, కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. సాయితేజ్ జోడీగా సంయుక్త మీనన్ నటించిన ఈ సినిమా, అడవి నేపథ్యంలో ఒక గిరిజన గూడెం చుట్టూ తిరుగుతుంది. ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ అంచనాలు పెంచుతూ వెళ్లాయి. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా 'కలల్లో' అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'కలల్లోనే ఉలికిపడుతున్నా .. నిజాన్ని ఒక కొలిక్కి తేవేంటే. ఇలా అయోమయంగా నేనున్నా ఇదంటు తేల్చవేమిటే" అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాటను బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చిత్రీకరించారనే విషయం తెలుస్తోంది.

అజనీశ్ లోక్ నాథ్ స్వరపరిచిన ఈ పాటకి అనంతశ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి - మధుశ్రీ ఆలపించారు. రాజు సుందరం కొరియోగ్రఫీని అందించాడు. ఇది హారర్ థ్రిల్లర్ కావడం .. దీనికి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.

More Telugu News