Samantha: 'శాకుంతలం' మండే టాక్!

Shaakuntalamn movie update

  • ఈ నెల 14న విడుదలైన 'శాకుంతలం'
  • గ్రాఫిక్స్ తో ముడిపడిన కథ ఇది 
  • అసంతృప్తిని కలిగించే గ్రాఫిక్స్ వర్క్
  • ప్రధానమైన పాత్రలలో తగ్గిన బలం 
  • మాస్ నుంచి .. యూత్ నుంచి దక్కని మార్కులు

సమంత ప్రధానమైన పాత్రను పోషించిన 'శాకుంతలం' ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు నిర్మాణంలో .. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా ఇటు 2Dలోను .. అటు 3Dలోను థియేటర్లకు వచ్చింది. 'శాకుంతలం' టైటిల్ ను డిజైన్ చేయించిన తీరు .. సినిమా నుంచి వదులుతూ వచ్చిన పోస్టర్స్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను థియేటర్లలో దిగబెట్టారు. 

అయితే ఎందుకనో తెలియదుగానీ విడుదల తేదీ నాటికి ఈ సినిమాపై బజ్ ను పెంచడంలో టీమ్ విఫలమైంది. ట్రైలర్ లాంచ్ .. ప్రెస్ మీట్ అంటూ హడావిడి చేశారుగానీ, ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించలేకపోయారు. ఈ జనరేషన్ కి ఈ కథ చెప్పడమే ముఖ్య ఉద్దేశమని ప్రమోషన్స్ లో గుణశేఖర్ చెప్పారు. అయితే నిదానంగా సాగే ఈ కథను .. ఈ జనరేషన్ కి తగినట్టు స్పీడ్ గా గుణశేఖర్ చెప్పలేకపోయారనే టాక్ విడుదల రోజునే వచ్చేసింది. 

సమంత లుక్ పరంగా .. కాస్ట్యూమ్స్ పరంగా .. గ్రాఫిక్స్ పరంగా .. ఈ సినిమా మైనస్ మార్కులను సంపాదించుకుంది. సమంత ... దేవ్ మోహన్ .. మోహన్ బాబు పాత్రలను పక్కన పెడితే, మిగతా ఏ పాత్రను కూడా గుణశేఖర్ సంతృప్తికరంగా మలచలేకపోయారు. మేనకగా సీనియర్ నటి మధుబాలను తీసుకోవడం .. మాండవ్యుడిగా శివబాలాజీతో కామెడీ చేయించడం గుణశేఖర్ చేసిన మరో పొరపాటుగా కనిపిస్తాయి. ఇక అల్లు అర్హ పాత్ర కూడా ఏకపాత్ర అభినయంలా అనిపిస్తుంది అంతే. పాటల పరంగా .. విజువల్స్ పరంగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను కొంతవరకూ ఆకట్టుకుంటుంది. పైన చెప్పిన ఇతర కారణాల వలన యూత్ ను .. మాస్ ను నిరాశ పరుస్తోందనేది ఆడియన్స్ అభిప్రాయం. 

More Telugu News