Dhoomam: నిప్పు లేకుండా పొగ రాదు.. ఇదిగో తొలి నిప్పు రవ్వ.. ఆసక్తికరంగా ‘ధూమమ్’ ఫస్ట్ లుక్!

Dhoomam First Look released

  • ధూమమ్ పోస్టర్ లో ప్లాస్టర్ తో కనిపించిన ఫహాద్‌ ఫాజిల్‌
  • బ్యాక్ గ్రౌండ్ లో కనిపించిన అపర్ణా బాలమురళి
  • వచ్చే ఏడాది సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు

వినూత్న కథలతో ప్రేక్షకులను పలకరిస్తుంటారు మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌. ఓటీటీల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘పుష్ప’ సినిమాలో భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ పాత్రలో ‘పార్టీ లేదా పుష్ప’ అంటూ మరింత చేరువయ్యారు. గతేడాది కమలహాసన్ ‘విక్రమ్’ సినిమాలోనూ సహాయ నటుడిగా మెరిశారు.

ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా ‘ధూమమ్’. ‘కేజీఎఫ్‌’ సిరీస్, ‘కాంతార’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన ‘హోంబలే ఫిల్మ్స్‌’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజైంది. ఈ పోస్టర్ ను వినూత్నంగా తీర్చిదిద్దారు. అందులో ఫహాద్‌ ఫాజిల్‌ ప్లాస్టర్‌ వేసుకుని ఉన్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో అపర్ణా బాలమురళి కనిపించారు. ‘నిప్పు లేకుండా పొగ రాదు.. ఇదిగో నిప్పు రవ్వ’ అని క్యాప్షన్ ఇచ్చారు. 

‘యూ టర్న్‌’ సినిమాను తెరకెక్కించిన పవన్‌ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. నేషనల్ అవార్డు విన్నింగ్‌ నటి అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకులు ముందుకు రానుంది.

More Telugu News