Corona Virus: దేశంలో కాస్త తగ్గిన కరోనా

India logs 9111 new Covid19 cases

  • కొత్తగా 9,111 కేసులు
  • పాజిటివిటీ రేటు 8.40 శాతంగా నమోదు
  • 60 వేలు దాటిన యాక్టివ్ కేసులు 

దేశంలో నాలుగు రోజుల నుంచి పది వేల పైనే నమోదవుతున్న కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,111 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం ప్రకటించింది. ఆదివారం 10,093 కేసులు రాగా.. ఒక్క రోజులోనే దాదాపు వెయ్యి కేసులు తగ్గడం కాస్త ఊపశమనం కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 8.40 శాతంగా ఉంది. వారంవారీ పాజిటివిటీ రేటు 4.94 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తన బులిటెన్ లో పేర్కొంది.

దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 60 వేల మార్కు దాటింది. ప్రస్తుతం 60,313 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడచిన 24 గంటల్లో వైరస్ వల్ల 27 మరణాలు నమోదయ్యాయి. గుజరాత్ లోనే ఆరుగురు చనిపోయారు. కరోనా వల్ల దేశంలో మరణాల సంఖ్య 5,31,141కి చేరుకుంది. ఇక, ఒక్క రోజులో 6,313 మంది వైరస్ నుంచి కోలుకున్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. జాతీయ రికవరీ రేటు 98.68 శాతంగా ఉంది.

Corona Virus
COVID19
  • Loading...

More Telugu News