Sudigali Sudheer: ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న సుడిగాలి సుధీర్?

Sudigali Sudheer getting married

  • రష్మి, సుధీర్ ల మధ్య ప్రేమ ఉందంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం
  • తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన జంట
  • వరుసకు మరదలు అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ తాజాగా ప్రచారం

జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్... కమెడియన్ గా ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. టాలీవుడ్ లో హీరోగా ఎదిగాడు. మరోవైపు వయసు పెరిగిపోతున్నా సుధీర్ మాత్రం పెళ్లి జోలికి వెళ్లలేదు. తన తోటి కమెడియన్స్ అందరూ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. యాంకర్ రష్మితో సుధీర్ కి లవ్ అఫైర్ ఉందంటూ ఎప్పటి నుంచో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎంతో చనువుగా కనిపించే వీరిద్దరూ తమ మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. 

తాజాతా సుధీర్ గురించి మరో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడనేదే ఆ ప్రచారం. వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయినే ఆయన పెళ్లి చేసుకుంటున్నాడని చెపుతున్నారు. సినిమాల విషయానికి వస్తే... ఇటీవల ఆయన నటించిన 'గాలోడు' సినిమా విజయాన్ని సాధించింది. దీంతో, ఆయనకు హీరోగా మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి.  

More Telugu News