Sai Tej: ఏంట్రా ఈ జీవితం అనిపించింది .. స్టేజ్ పై ఉద్వేగానికి లోనైన సాయితేజ్

Virupaksha Pre  Release Event

  • గతంలో జరిగిన ప్రమాదం గురించి ప్రస్తావించిన సాయితేజ్ 
  • మాట్లాడలేకపోయానని ఆవేదన 
  • పట్టుదల పెరిగిందంటూ వెల్లడి 
  • ధైర్యంతో ముందుకు వెళ్లాలని వ్యాఖ్య


సాయితేజ్ - కార్తీక్ వర్మ దండు కాంబినేషన్లో రూపొందిన 'విరూపాక్ష' సినిమా, కొంతసేపటి క్రితం ఏలూరులో ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది. ఈ వేదికపై సాయితేజ్ మాట్లాడుతూ .. "2009లో హీరోగా నా కెరియర్ మొదలైంది. అప్పటి నుంచి 2016 వరకూ వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. మీ అందరి ప్రేమాభిమానాలతో మంచి హిట్లు కొట్టాను. 2016 నుంచి వరుసగా ఆరు ఫ్లాపులు వచ్చాయి" అని అన్నాడు. 

"ఆ ఫ్లాపుల తరువాత మరింత కష్టపడటం నేర్చుకున్నాను. 'చిత్రలహరి' తరువాత నా కెరియర్ కుదురపడిందని అనుకున్నాను. కానీ అంతలోనే 2021లో బైక్ జారి పడిపోయాను. ఆ తరువాత నేను కళ్లు తెరిచి చూసింది మా అమ్మగారినే, సారీ చెబుదామని అంటే నాకు మాట రాలేదు. నిలబడలేక పోయాను. ఏంటిరా ఈ జీవితం అనిపించింది" అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. 

"నేను మాట్లాడవలసిందే .. నా అభిమానులను సంతోషపెట్టవలసిందే అనే నిర్ణయానికి వచ్చాను. ఎవరు ఏమనుకున్నా ఫరవాలేదు .. తిరిగి నా అభిమానుల నుంచి ప్రేమను పొందాలనుకున్నాను. అందుకోసం ఎంత కష్టమైనా పడాలనుకున్నాను.. పడుతున్నాను" అంటూనే, ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ వాడండి అని చెప్పుకొచ్చాడు.

Sai Tej
Samyuktha Menon
Karthik Dandu
Virupaksha Movie
  • Loading...

More Telugu News