Sai tej: సాయితేజ్ ను అలా చూసి కన్నీళ్లు ఆగలేదు: సుకుమార్

Virupaksha Pre  Release Event

  • 'విరూపాక్ష'కి ఒక నిర్మాతగా సుకుమార్ 
  • సాయితేజ్ తనని తాను కూడదీసుకున్నాడని వెల్లడి 
  • నటుడిగా ఇది ఆయనకి పునర్జన్మని వ్యాఖ్య 
  • ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమన్న సుకుమార్ 

సాయితేజ్ హీరోగా చేసిన 'విరూపాక్ష' ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది. కార్తీక్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బీవీఎస్ ఎన్ ప్రసాద్ తో కలిసి సుకుమార్ నిర్మించాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో సుకుమార్ మాట్లాడుతూ .. " సాయితేజ్ గురించి నాకు చాలా కాలంగా తెలుసు. తను ఎక్కడికి వచ్చినా అందరితో చాలా సరదగా ఉంటూ .. జోకులు వేస్తూ .. నవ్విస్తూ ఉండేవాడు" అని అన్నాడు. 

అలాంటి సాయితేజ్ ను ప్రమాదం తరువాత నేను చూడలేదు. ఈ సినిమా షూటింగు మొదలైన తరువాత సెట్ కి వెళ్లాను. ఎంతో యాక్టివ్ గా ఉండే సాయితేజ్, ఒక్కో అక్షరం కూడబలుక్కుని ప్రాక్టీస్ చేస్తూ ఉండటం చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు. వ్యక్తిగానే కాదు .. నటుడిగా కూడా ఇది ఆయనకి పునర్జన్మనే" అని చెప్పాడు. 

"ఆ రోజున ఆ పరిస్థితిలో ఉన్న సాయితేజ్ తనని తాను కూడదీసుకుని, ఈ రోజున ఈ సినిమాను ఈ స్థాయికి తీసుకుని రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని భావిస్తున్నాను. ఇక సంయుక్త చాలా బాగా తెలుగు మాట్లాడుతోంది. ఆమె పెర్ఫార్మెన్స్ చూసిన తరువాత కార్తీక్  సెలెక్షన్ కరెక్ట్ అనిపించింది" అని అన్నాడు.

Sai tej
Samyuktha Menon
Sukumar
Virupaksha Movie
  • Loading...

More Telugu News