Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 178 రన్స్... 4 పరుగులకే ఓపెనర్లు డౌన్

Rajasthan Royals loses openers in 178 runs chasing
  • గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
  • మొదట బ్యాటింగ్ చేసిన టైటాన్స్
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 177 పరుగులు
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 45, డేవిడ్ మిల్లర్ 46, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 28, అభినవ్ మనోహర్ 27, సాయి సుదర్శన్ 20 పరుగులు చేశారు.

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ 2, బౌల్ట్ 1, జంపా 1, చహల్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో గుజరాత్ బ్యాటింగ్ లో ఏమంత ఊపు కనిపించలేదు. మిడిల్ ఓవర్లలో స్కోరు మందగించింది. హిట్టింగ్ చేసే సమయంలో గిల్ అవుటయ్యాడు. అభినవ్ మనోహర్ మాత్రం ఆడినంత సేపు దూకుడు కనబర్చాడు. 13 బంతులాడిన మనోహర్ 3 సిక్సులు బాదాడు.

ఇక, 178 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1)ను హార్దిక్ పాండ్యా అవుట్ చేయగా... డాషింగ్ ఓపెనర్ జోస్ బట్లర్ (0) ను షమీ బౌల్డ్ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 2.5 ఓవర్లలో 4 పరుగులు మాత్రమే.
Rajasthan Royals
Gujarat Titans
IPL

More Telugu News