Kollywood: ఏకంగా10 భాషల్లో సూర్య కొత్త చిత్రం

Suriya 42 titled as kanguva in 10 languages

  • శివ దర్శకత్వంలో పీరియాడిక్ సినిమా చేస్తున్న సూర్య
  • చిత్రానికి ‘కంగువ’ టైటిల్ ఖరారు
  • హీరోయిన్ గా నటిస్తున్న దిశా పఠానీ

తమిళ స్టార్ హీరో, దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉన్న సూర్య మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సూర్య ప్రస్తుతం సిరుత్తే శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం పది భాషల్లో విడుదల కానుంది. 2డి, 3డి ఫార్మాట్ లో అభిమానులను అలరించనుంది. బాలీవుడ్ నటి దిశా పఠానీ హీరోయిన్ నటిస్తోంది. 

పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ను చిత్ర బృందం ఖరారు చేసింది. దీనికి ‘కంగువ’ అనే పేరు పెట్టింది. కంగువ అంటే అత్యంత పరాక్రమవంతుడు అని అర్థం.  సినిమా షూటింగ్ గోవా, చెన్నై, ఇతర ప్రాంతాల్లో జరుగుతోంది. వంశీ, ప్రమోద్, కేఈ జ్ఞానవేల్ రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2024లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.

More Telugu News