Amazon: మళ్లీ కోసేస్తున్న గూగుల్.. మరింతమందికి ఉద్వాసన!

Google CEOs hint at more layoffs

  • టెక్ కంపెనీల్లో కొనసాగుతున్న ఉద్యోగుల కోత
  • 27  వేల మంది ఉద్యోగులపై వేటేయక తప్పలేదంటూ అమెజాన్ సీఈవో లేఖ
  • జనవరిలో 18 వేలు, మార్చిలో 9 వేల మందిని తొలగించిన అమెజాన్

టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత ఆగడం లేదు. ఇప్పటికే పలువురిని ఇంటికి పంపిన గూగుల్ కంపెనీ తాజాగా మరికొంతమందిపై వేటేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు వార్తలు బయటకొచ్చాయి. అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ కంపెనీ షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో ఉద్యోగుల తొలగింపు విషయాన్ని ప్రస్తావించారు. వనరులను ఎక్కడ వినియోగించాలనే దానిపై ప్రాధాన్యత క్రమంలో తీసుకున్న నిర్ణయం కారణంగా 27 వేల మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందంటూ ఆండీ ఆ లేఖలో పేర్కొన్నారు.  

తమ ఖర్చులను క్రమబద్ధీకరించుకునే క్రమంలో గత కొన్ని నెలలుగా పలు మార్పులు చేసినట్టు సీఈవో ఆ లేఖలో పేర్కొన్నారు. చాలా నాయకత్వ బృందాల్లానే తాము తమ వ్యాపారంలో మూల్యాంకనం చేస్తూ ఉంటామని, అనుకూలతలను కొనసాగిస్తామని వివరించారు. మరోవైపు, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. ఖర్చులను తగ్గించుకునేందుకు అవకాశం ఉన్న ప్రతీ విషయాన్ని లెక్కలోకి తీసుకుంటున్నట్టు చెప్పారు. 
 
గూగుల్ ఈ ఏడాది జనవరిలో 12 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. అదే నెలలో అమెజాన్ 18 వేల మందిని ఇంటికి పంపింది. మార్చిలో తమ రెండో దశ ప్రణాళికలను కూడా అమలు చేశామని, మరో 9 వేలమందికి ఉద్వాసన పలికామని పేర్కొంది. కాగా, అంతర్జాతీయంగా 586 సంస్థలు 1,70,549 మంది ఉద్యోగులను తొలగించాయి.

Amazon
Google
Lay Offs
Andy Jassy
Sundar Pichai
  • Loading...

More Telugu News