: 'రూపాయికే ఇడ్లీ' మరో తొమ్మిది నగరాలకు విస్తరణ
'రూపాయికే ఇడ్లీ' పథకం విజయవంతం కావడంతో తమిళనాడు సర్కారు ఆనందంతో పొంగిపోతోంది. అల్పాదాయ వర్గాల కోసం చెన్నైలో కొద్దినెలల క్రితం ప్రవేశపెట్టిన ఈ పథకం అమిత జనాదరణ పొందింది. దీంతో, ఈ పథకాన్ని మరో 9 నగరాలకు విస్తరించాలని తమిళనాడు సీఎం జయలలిత నిర్ణయించారు. ప్రస్తుతం చెన్నై నగరంలో ఈ తరహా బడ్జెట్ క్యాంటీన్లు 200 వరకు నిర్వహిస్తున్నారు. వాటిలో రూపాయికే ఇడ్లీతోపాటు పొంగల్, పులిహోర వంటకాలను చవక ధరలకే అందిస్తున్నారు. దీంతో, బడుగు జీవులతోపాటు ఉన్నతోద్యోగులు సైతం ఈ క్యాంటీన్ల వద్ద బారులు తీరడం విశేషం.