Viral Videos: విరాట్ అర్థసెంచరీ.. అనుష్క ముఖంలో ఎంతటి సంబరమో!

Anuskha sharma erupts in joy after virat scores half century
  • రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య  మ్యాచ్‌లో కోహ్లీ దూకుడు
  • 34 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసిన వైనం
  • విరాట్ ఫాం చూసి అంబరాన్నంటిన అనుష్క సంబరం
  • నెట్టింట వీడియో వైరల్
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఇవాల్టి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ దుమ్ము రేపిన విషయం తెలిసిందే. కేవలం 34 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఆరు ఫోర్లు, ఒక సిక్సుతో దుమ్మురేపాడు. గొప్ప ఫాంలో ఉన్న తాను తలుచుకుంటే పరుగుల వరద ఎలా ఉంటుందో నేడు కోహ్లీ చూపించాడు. ఆ పరుగుల వరద చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. ఇక విరాట్ భార్య అనుష్క శర్మ ఆనందానికికైతే అంతేలేకుండా పోయింది. భర్త అర్థసెంచరీ కొట్టడం చూసి ఆమె ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. ముఖమంతా నవ్వు పరుచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా అవుతోంది. ‘‘రాజు తన రాణిని ఎన్నడూ నిరాశ పరచడు’’ అన్న క్యాప్షన్‌తో విడుదలైన ఈ వీడియో నెట్టింట ఎంతగా హల్‌చల్ చేస్తోందో మాటల్లో చెప్పడం కష్టం. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. 


Viral Videos
Virat Kohli
Anushka Sharma

More Telugu News