Akhil: సెట్లో సాక్షి వైద్యను తిట్టేశాను: డైరెక్టర్ సురేందర్ రెడ్డి

Agent movie press meet

  • ఈ నెల 28న రిలీజ్ కానున్న 'ఏజెంట్'
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్ 
  • అఖిల్ ఏదైనా చేయగలడన్న సురేందర్ రెడ్డి 
  • సాక్షి వైద్యకి మంచి ఫ్యూచర్ ఉందని కితాబు

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా 'ఏజెంట్' సినిమా రూపొందింది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. దర్శక నిర్మాతలతో పాటు అఖిల్ .. సాక్షి వైద్య పాల్గొన్నారు.

సురేందర్ రెడ్డి మాట్లాడుతూ .. "ఈ సినిమా కోసం అందరి కంటే ఎక్కువగా అఖిల్ కష్టపడ్డాడు. సినిమా పూర్తికావడానికి ఆలస్యమైనా సిక్స్ ప్యాక్ మెయింటెయిన్ చేస్తూ వచ్చాడు. అఖిల్ అన్నీ చేయగలడు .. ఆయనకి ఉన్న టాలెంట్ లో నేను ఫిఫ్టీ పెర్సెంట్ మాత్రమే వాడుకున్నానని అనిపించింది" అన్నారు. 

ఇక సాక్షి వైద్యను ఇన్ స్టాలో చూసి సెలెక్ట్ చేశాము. తను ఇంతవరకూ ఏ సినిమాలో చేయలేదు. నేరుగా సెట్ కి వచ్చి చెప్పింది చేసేది. ఒక్కోసారి అనుకున్న అవుట్ పుట్ రాబట్టడానికి తిట్టవలసి వచ్చింది. తనకి మంచి ఫ్యూచర్ ఉందనే విషయం నాకు అర్థమైంది. ఇక మమ్ముట్టి వంటి సీనియర్ స్టార్ తో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News