saindhav: ‘సైంధవ్’లో జెర్సీ హీరోయిన్.. ఫస్ట్ లుక్ రిలీజ్

jersey movie actress is in saindhav movie

  • వెంకటేశ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘సైంధవ్’
  • శ్రద్ధా శ్రీనాథ్ కూడా నటిస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్
  • ‘మనోజ్ఞ’గా కనిపించనున్నట్లు ఫొటో విడుదల

‘రానా నాయుడు’ వెబ్ సిరీస్, ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమా తర్వాత విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న చిత్రం ‘సైంధవ్’. టాలెంటెడ్ దర్శకుడు శైలేశ్ కొలను దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

ఈ సినిమా నుంచి మేకర్స్ మరో అప్ డేట్ ఇచ్చారు. టాలెంటెడ్ నటి శ్రద్ధా శ్రీనాథ్.. సైంధవ్ లో నటిస్తున్నట్లు తెలిపారు. ఆమె లుక్ ను కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆమె ‘మనోజ్ఞ’గా కనిపించనున్నట్లు ప్రకటించారు. ‘‘తన నటనతో అందరినీ అలరించే సూపర్ టాలెంటెడ్ నటి!! సైంధవ్ బృందం అద్భుతమైన నటి శ్రద్ధాశ్రీనాథ్ ని స్వాగతిస్తోంది’’ అని నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ట్వీట్ చేసింది.  

‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్ లోకి శ్రద్ధా శ్రీనాథ్ ఎంట్రీ ఇచ్చింది. ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ సినిమాలోనూ మెరిసింది. అంతకుముందు 2017లో తమిళ్ లో వచ్చిన విక్రమ్ వేద సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. తర్వాత పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిచింది. 

ఇక సైంధవ్ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ స్థంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ సహా పలువురు నటులు కనిపించనున్నారు.

saindhav
shraddha srinath
sailesh kolanu
jersey

More Telugu News