Upasana: తన చెవి కమ్మలు ఇచ్చేసిన ఉపాసన... ఎందుకంటే...!

Upasana donates her ear rings

  • హైదరాబాదులో జోయా నగల దుకాణం ప్రారంభం
  • ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉపాసన
  • దోమకొండ ట్రస్టుకు తన పారితోషికం మొత్తం విరాళంగా ప్రకటన

అపోలో ఫౌండేషన్ తో తన కార్యదక్షత చాటుకున్న మెగా కోడలు ఉపాసన దాతృత్వ కార్యక్రమాల్లోనూ, సామాజిక సేవలోనూ ముందుంటారు. తాజాగా, ఉపాసన తన చెవి కమ్మలను విరాళంగా ఇచ్చేశారు. 

టాటా గ్రూప్ కు చెందిన ప్రీమియం బ్రాండ్ నగల సంస్థ జోయా కొత్త స్టోర్ ను హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేయగా, ఉపాసన ఆ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె తన పారితోషికం మొత్తాన్ని దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్ మెంట్ ట్రస్టుకు విరాళంగా ఇచ్చేశారు. తన లేటెస్ట్ మోడల్ చెవి కమ్మలను ఆమె దోమకొండ ట్రస్టుకు అందించారు. 

ఈ ట్రస్టు అణగారిన మహిళల అభ్యున్నతి, ఆర్థిక సుస్థిరత, సాధికారత కోసం కృషి చేస్తుంటుంది. 

దీనిపై ఉపాసన స్పందిస్తూ... టాటాల ఆధ్వర్యంలోని జోయా కొత్త స్టోర్ ను లాంచ్ చేయడం సంతోషదాయకమని పేర్కొన్నారు. అరుదైన, కాలాతీత ఆభరణాలకు జోయా పెట్టింది పేరని కితాబునిచ్చారు. దోమకొండ ట్రస్టుకు సహాయ సహకారాలు అందిస్తున్న జోయా యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.

Upasana
Ear Rings
Donation
Zoya's
Hyderabad
DFVDT
  • Loading...

More Telugu News