CM Ramesh: వైసీపీ ప్రభుత్వాన్ని బీజేపీ ఉపేక్షించే స్థితిలో లేదు: సీఎం రమేశ్

BJP will not spare YSRCP govt says CM Ramesh

  • ఏపీలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయన్న సీఎం రమేశ్
  • రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శ
  • ప్రజలకు రూ. 10 ఇచ్చి రూ. 100 లాక్కుంటోందని దుయ్యబట్టిన ఎంపీ

జగన్ ప్రభుత్వంపై తమ పార్టీ సీరియస్ గా ఉందని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. వైసీపీ సర్కార్ ను ఉపేక్షించే స్థితిలో కేంద్రం లేదని చెప్పారు. ఏపీలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. వాస్తవాలను బయటపెడుతున్న మీడియాపై కూడా దాడులు జరుగుతున్నాయని అన్నారు. రైతు సమస్యలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు రూ. 10 ఇస్తున్న జగన్ ప్రభుత్వం... వారి నుంచి రూ. 100 లాక్కుంటోందని అన్నారు. అన్ని విషయాలను బీజేపీ హైకమాండ్ గమనిస్తోందని చెప్పారు. ఏపీలో రాబోయేది బీజేపీ కూటమి ప్రభుత్వమేనని అన్నారు.

CM Ramesh
BJP
YSRCP
  • Loading...

More Telugu News