Pooja Hegde: 'సల్మాన్ ఖాన్ తో డేటింగ్' వార్తలపై పూజ హెగ్డే స్పందన

Pooja Hegde response on relationship with Salman Khan

  • తనపై ఇలాంటి వార్తలు రావడం సహజమేనన్న పూజ హెగ్డే
  • ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని వ్యాఖ్య
  • ఇలాంటి ప్రచారాలపై స్పందించే సమయం కూడా లేదన్న పూజ

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో హీరోయిన్ పూజ హెగ్డే ప్రేమాయణం నడుపుతోందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. బాలీవుడ్ మీడియా సైతం ఈ అంశానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీనిపై పూజ హెగ్డే స్పందించింది. తన గురించి ఇలాంటి వార్తలు రావడం సహజమేనని చెప్పింది. ఇలాంటి వార్తలను తాను చదువుతానే కానీ, పెద్దగా పట్టించుకోనని తెలిపింది. 

ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని, తనకు సింగిల్ గా ఉండటమే ఇష్టమని చెప్పింది. ఇప్పుడు తన దృష్టి సినిమాలపైనే ఉందని తెలిపింది. మరెన్నో సినిమాలలో నటించాలనేదే తన లక్ష్యమని చెప్పింది. ఇలాంటి ప్రచారాలపై స్పందించే సమయం కూడా తనకు లేదని తెలిపింది. తన గురించి ఎవరు ఎలాంటి వార్తలను ప్రచారం చేసినా పట్టించుకోనని చెప్పింది.   

More Telugu News