Jagan: దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు అంబేద్కర్: జగన్

Jagan praises Ambedkar

  • అంబేద్కర్ కు నివాళి అర్పించిన జగన్
  • ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి అంబేద్కర్ అని ప్రశంస
  • అంబేద్కర్ సేవలను మరువలేమన్న ముఖ్యమంత్రి

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ దేశం గర్విచదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ అంబేద్కర్ అని అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి అని కొనియాడారు. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి అని... వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత అని అన్నారు. భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేమని చెప్పారు. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు వేశామని అన్నారు.

Jagan
YSRCP
Ambedkar
  • Loading...

More Telugu News