Akhil: 'ఏజెంట్' నుంచి రామ కృష్ణ గోవింద లిరికల్ సాంగ్ రిలీజ్!

Agent movie lyrical song released

  • అఖిల్ నుంచి మరో యాక్షన్ మూవీగా 'ఏజెంట్'
  • కథానాయికగా సాక్షి వైద్య టాలీవుడ్ ఎంట్రీ 
  • సంగీతాన్ని సమకూర్చిన హిప్ హాప్ తమిళ
  • ఈ నెల 28వ తేదీన సినిమా రిలీజ్

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా రూపొందింది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాతో కథానాయికగా సాక్షి వైద్య పరిచయమవుతోంది. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు.

ప్రమోషన్స్ లో భాగంగా 'రామకృష్ణ గోవిందా' అంటూ సాగే ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'రామ పోయి కృష్ణ వచ్చే .. బాధే పోయి హ్యాపీ వచ్చిందా, నైటే పోయి లైటే వచ్చే .. ప్రేమే పోతూ పోతూ ఏదో నేర్పించిందా ' అంటూ ఈ పాట మొదలవుతోంది.

హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందించిన ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా, రామ్ మిర్యాల ఆలపించాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. ఇటు అఖిల్ .. అటు సురేందర్ రెడ్డి ఇద్దరూ కూడా చాలా గ్యాప్ తరువాత ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఈ ఇద్దరికీ ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి. 

More Telugu News