Priyadarshi: నా జీవితంలో నేను తట్టుకోలేకపోయిన బాధ అదొక్కటే!: 'బలగం' విజయలక్ష్మి

Balagam Vijayalakshmi Interview

  • 'బలగం' సినిమాతో పేరు తెచ్చుకున్న విజయలక్ష్మి 
  • 'పోశవ్వ'గా మంచి మార్కులు తెచ్చుకున్న నటి 
  • నాటకరంగంలో అనుభవం ఉందన్న విజయలక్ష్మి
  • తన చిన్న కొడుకు పోయాడంటూ ఆవేదన

'బలగం' సినిమా చూసినవాళ్లు అందులో కొమరయ్య చెల్లి 'పోశవ్వ' పాత్రను మరిచిపోలేరు. ఒక వైపున అన్నగారు చనిపోయాడని ఏడుస్తూనే .. మరో వైపున అక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారనేది గమనిస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో తన పెద్దరికాన్ని ఎవరూ పట్టించుకోలేదని రుసరుసలాడుతూ, అవకాశం దొరికితే చాలు సూటిపోటిమాటలంటూ గొడవలకి కారణమవుతూ ఉంటుంది. 

ఈ పాత్రలో అంతగా ఇమిడిపోయిన ఆర్టిస్టు పేరు విజయలక్ష్మి.  తాజా ఇంటర్వ్యూలో విజయలక్ష్మి మాట్లాడుతూ, నేను నాటకాలు వేస్తుంటాను .. అంతకుముందు హరికథలు కూడా చెప్పేదానిని. చాలా అవార్డులు వచ్చాయి కూడా. నేను చేసిన మొదటి సినిమా 'బలగం' మాత్రమే. అందరూ నన్ను 'బలగం' విజయలక్ష్మి అంటూ ఉంటే ఆనందంగా ఉంది" అని అన్నారు. 

"నాకు ఈ రోజున ఇంతమంచి పేరు రావడానికి కారణం వేణు గారే. సహహజత్వం కోసం ఆయన ఎంత కష్టపడ్డారనేది నాకు తెలుసు. చాలా కలం క్రితమే నా భర్త చనిపోయారు. ఇద్దరు కొడుకులు ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకున్నారు. అయితే చిన్నకొడుకు ఆ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ సమయంలో అతని భార్య గర్భవతి. ఆ ఒక్క సంఘటన నుంచే నేను ఇంతవరకూ తేరుకోలేకపోతున్నాను. ఆ బాధను మరిచిపోవడం కోసమే నటనపై ఎక్కువ దృష్టిపెట్టాను" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News