Nani: 'దసరా'లో క్రికెట్ సీన్ హైలైట్ .. వీడియో రిలీజ్ చేసిన టీమ్!

Dasara Movie Update

  • మార్చి 30న వచ్చిన 'దసరా'
  • మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయిన కంటెంట్ 
  • రెండు వారాల్లో భారీ వసూళ్లు
  • సినిమా హైలైట్స్ లో క్రికెట్ సీన్ ఒకటి  

నాని హీరోగా రూపొందిన 'దసరా' సినిమా, ఆయన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. చాలా వేగంగా 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా, ఆయన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. నాని చేసిన ఫస్టు పాన్ ఇండియా సినిమా క్రెడిట్ కూడా ఈ సినిమాకే దక్కింది. 

అలాంటి ఈ సినిమాలో క్రికెట్ కి సంబంధించిన ఒక సీన్ ఉంది. తన స్నేహితుడి కోసం విలన్ సమక్షంలో నాని ఈ క్రికెట్ లో తప్పకుండా గెలవాల్సిన అవసరం ఏర్పడుతుంది. తమ టీమ్ ఓటమి చివరికి వెళ్లినప్పుడు నాని ఒక్కసారిగా చెలరేగిపోతాడు. థియేటర్లో ఈ సీన్ మంచి కిక్ వచ్చేలా చేస్తుంది. 

అలాంటి క్రికెట్ గేమ్ కి సంబంధించిన వీడియోను కొంతసేపటి క్రితం వదిలారు. ఈ క్రికెట్ ఎపిసోడ్ లో నానీలోని స్టైల్ ను ఆవిష్కరించిన తీరు విజిల్స్ వేయిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ఆడియన్స్ లో హుషారెత్తించే సన్నివేశాలలో ఇది ఒకటి.

More Telugu News