Heat Wave: ఏపీలో రేపు కూడా వడగాడ్పులు

Heat wave continues in AP

  • ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతల నమోదు
  • పగటి ఉష్ణోగ్రతల్లో 3 నుంచి 4 డిగ్రీల అధికంగా నమోదు
  • నేడు 126 మండలాల్లో వడగాడ్పులు
  • రేపు 108 మండలాలపై వడగాడ్పుల ప్రభావం

ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గత కొన్నిరోజుల నుంచి సూర్య ప్రతాపం కొనసాగుతుండగా, 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఎండ వేడిమి నమోదవుతోంది. దానికి తోడు వడగాడ్పులు కూడా వీస్తున్నాయి. భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఏపీకి రెండ్రోజుల పాటు వడగాడ్పుల హెచ్చరిక చేసింది. రాష్ట్రంలో నేడు 126 మండలాల్లోనూ, రేపు 108 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. 

దీనిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ స్పందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా, నేడు అత్యధికంగా అనకాపల్లి, ఎన్టీఆర్ , విజయనగరం జిల్లాల్లోని మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ తన నివేదికలో వెల్లడించింది.

Heat Wave
Andhra Pradesh
IMD
  • Loading...

More Telugu News