KCR: కేసీఆర్ దెబ్బ ఇలా ఉంటుంది.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది: కేటీఆర్

KTR comments on Vizag steel plant

  • స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారన్న కేటీఆర్
  • విశాఖ ఉక్కుపై కేసీఆర్ గట్టిగా మాట్లాడారని వ్యాఖ్య
  • స్టీల్ ప్లాంట్ పై అధ్యయనం చేసేందుకు నిపుణుల బృందాన్ని పంపుతామన్న కేటీఆర్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం వెనకడుగు వేసిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు చెప్పారని... ఆయన పోరాటంతో కేంద్రం వెనకడుగు వేసిందని అన్నారు. విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడింది కేసీఆరేనని చెప్పారు. తాము తెగించి పోరాడాం కనుకనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకణపై కేంద్రం తగ్గిందని అన్నారు. కేసీఆర్ దెబ్బ అంటే ఇలాగే ఉంటుందని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై అధ్యయనం చేసేందుకు సింగరేణి నుంచి నిపుణుల బృందాన్ని పంపుతామని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ ఈరోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్లాంట్ పూర్తి స్థాయిలో పని చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన చెప్పారు. 

KCR
TRS
BRS
Vizag Steel Plant
  • Loading...

More Telugu News