Sangeetha: 'ఆహా' తమిళంలో స్ట్రీమింగ్ కానున్న 'మసూద'

Masooda tamil version in aha

  • థియేటర్స్ లో హిట్ కొట్టిన 'మసూద'
  • మొదటి నుంచి చివరివరకూ కట్టిపడేసే కథ  
  • 'ఆహా'లో అందుబాటులో ఉన్న తెలుగు వెర్షన్ 
  • రేపటి నుంచి 'ఆహా' తమిళంలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమా

క్రితం ఏడాదిలో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను నమోదు చేసిన సినిమాలలో ఒకటిగా 'మసూద' కనిపిస్తుంది. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమాకి, సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా , అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. అలాంటి ఈ సినిమా తెలుగు వెర్షన్ 'ఆహా'లో ఆల్రెడీ ఆందుబాటులో ఉంది. 

ఇక 'ఆహా' తమిళంలో 'మసూద' తమిళ్ వెర్షన్ రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. తిరువీర్ .. కావ్య .. సంగీత .. బాంధవి శ్రీధర్ .. శుభలేఖ సుధాకర్ ప్రధానమైన పాత్రలను పోషించారు. 

తక్కువ బడ్జెట్ లో .. తక్కువ పాత్రలతో  .. తక్కువ సంభాషణలతో ప్రేక్షకులను భయపెట్టడం ఈ సినిమా ప్రత్యేకత. దెయ్యం చుట్టూనే కథ నడుస్తూ ఉంటుందిగానీ, దెయ్యం పాత్ర మాత్రం తెరపై కనిపించదు. కెమెరా పనితనం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్. తమిళ వెర్షన్ కి కూడా ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు.

More Telugu News