Soori: 'విడుదల' కోసం ఎంత కష్టపడ్డారనేది చెబుతున్న మేకింగ్ వీడియో!

Vidudala movie making video

  • సూరి ప్రధానమైన పాత్రను పోషించిన 'విడుదల'
  • కీలకమైన పాత్రను పోషించిన విజయ్ సేతుపతి 
  • ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ 
  • ఈ నెల 15వ తేదీన సినిమా రిలీజ్  

ఇటీవల తమిళంలో థియేటర్లకు వచ్చిన 'విడుదలై' అక్కడ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. అక్రమార్కులను నిలదీసే దళ నాయకుడిగా విజయ్ సేతుపతి .. సాధారణమైన పోలీస్ గా సూరి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఫారెస్టు నేపథ్యంలో సాగే ఈ సినిమాకి వెట్రి మారన్ దర్శకుడు. తమిళంలో వెట్రి మారన్ సినిమాలను ఇష్టపడేవారు ఎక్కువగా కనిపిస్తారు. 

కథను బట్టి .. పాత్రలను బట్టి ఆర్టిస్టులను ఎంచుకోవటం వెట్రి మారన్ ప్రత్యేకత. అందువలన ఆయన సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. అలా రూపొందిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు అల్లు అరవింద్ తీసుకొస్తున్నారు. ఇక్కడ ఈ సినిమా ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. 

ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా మేకింగ్ వీడియోను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. దట్టమైన అడవిలో .. గిరిజన గూడెంలోని ఇరుకైన సందుల్లో .. ఎత్తైన కొండలపై చిత్రీకరణ ఎలా సాగిందనేది చూపించారు. స్కెటింగ్ చేస్తూ కెమెరాతో షూట్ చేయడం .. రోప్ సాయంతో చిత్రీకరించడం .. చెట్లపై లైట్స్ ను సెట్ చేయడం కోసం ఎంత కష్టపడింది చూపించారు. రోప్ ఉన్నప్పటికీ సూరి గాయపడటం ఈ వీడియోలో మనకి కనిపిస్తుంది.

More Telugu News