Nani: 'దసరా' కోసం కీర్తి ఎంత పెర్ఫెక్ట్ గా డబ్బింగ్ చెప్పిందో చూడండి!

Dasara Movie Update

  • 'దసరా' సినిమాలో సందడి చేసిన కీర్తి సురేశ్ 
  • ఆమె మాస్ స్టెప్పులను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్ 
  • తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పిన కీర్తి సురేశ్ 
  • ఆమె అంకితభావానికి ఇదో మచ్చుతునక

అందం .. అభినయం రెండూ కలగలిసిన కథానాయికగా కీర్తి సురేశ్ ను గురించి చెప్పుకోవచ్చు. పాత్ర ఏదైనా ఆ పాత్రలో ఒదిగిపోవడం కీర్తి సురేశ్ కి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి కీర్తి సురేశ్ ఇటీవల 'దసరా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆమె వెన్నెల పాత్రలో మాస్ లుక్ తో .. డీ గ్లామర్ రోల్ చేసింది. 

తెలంగాణ నేపథ్యంలో నడిచే ఈ కథలో ఆమె తెలంగాణ యాసలోనే డైలాగ్స్ చెప్పింది. ఈ సినిమాలో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుందంటే చాలామంది నమ్మరు. ఈ నేపథ్యంలోనే ఆమె డబ్బింగ్ చెబుతున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఎంత మాత్రం తడబడకుండా ఆమె డబ్బింగ్ చెబుతున్నప్పటి వీడియో చూస్తే, ఆమె అంకితభావం ఏ రేంజ్ లో ఉందనేది అర్థమవుతుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమాలో పెళ్లి కూతురుగా ఒక మ్యూజిక్ లెంగ్త్ లో కీర్తి వేసిన మాస్ స్టెప్పులకు సంబంధించిన వీడియోను అందరూ కూడా విపరీతంగా చూస్తున్నారు .. ఎంజాయ్ చేస్తున్నారు. కథాపరంగా తెలంగాణ నేపథ్యాన్ని కీర్తి ఎంతగా ఆకళింపు చేసుకుందనడానికి ఈ డాన్స్ ను ఒక నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. 

More Telugu News