Tollywood: తనలోని మరో ప్రతిభను ప్రదర్శించిన అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran turns cinematographer

  • సినిమాటోగ్రాఫర్ గా మారిన అనుపమ
  • దక్షిణాది భాషల్లో ఆమెకు మంచి డిమాండ్
  • కార్తికేయ 2తో బాలీవుడ్ లోనూ అవకాశాలు

ప్రేమమ్ చిత్రంతో తెరంగేట్రం చేసిన అనుపమ పరమేశ్వరన్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. దక్షిణాది భాషలన్నిట్లోనూ ఆమెకు ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. కార్తికేయ2 తర్వాత బాలీవుడ్ లోనూ ఆమెకు గుర్తింపు లభించింది. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అనుపమ ఇప్పుడు తనలోని మరో టాలెంట్ ను బయటపెట్టింది. ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్ గా మారి ఆశ్చర్యపరిచింది. 

సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన ‘ఐ మిస్ యు’ అనే షార్ట్ ఫిల్మ్‌తో డీవోపీగా పరిచయమైంది. ఈ షార్ట్ ఫిల్మ్‌ 'చాయ్ బిస్కెట్ యూట్యూబ్' ఛానెల్‌లో విడుదల అయ్యింది. డీవోపీగా అనుపమ పేరు చూసి అంతా ఆశ్చర్యపోయారు. అందులో ఆమె కెమెరా పనితనానికి అభినందనలు కూడా వస్తున్నాయి. గతంలో పలువురు హీరోయిన్స్ నటనతో పాటు దర్శకత్వం, సంగీతంలో తమ ప్రతిభ చాటుకున్నారు. అయితే, ఇలా సినిమాటోగ్రాఫర్‌‌గా మారిన తొలి హీరోయిన్‌ అనుపమనే  కానుంది.

More Telugu News