Sunil: 'ఫీలింగ్ స్టార్ ప్రీతమ్ కుమార్' గా సునీల్!

Bhuvana Vijayam Movie Update

  • సునీల్ హీరోగా 'భువన విజయమ్'
  • సినిమా బ్యాక్ గ్రౌండ్ లో నడిచే కథ 
  • కథలో హీరోగా కనిపించనున్న సునీల్ 
  • దర్శకుడిగా ఎలమంద చరణ్ పరిచయం

సునీల్ ఈ మధ్య కాలంలో వీలైతే హీరోగా .. లేదంటే విభిన్నమైన పాత్రలను చేస్తూ ముందుకు వెళుతున్నాడు. అలాంటి సునీల్ హీరోగా మరొకసారి పలకరించడానికి రెడీ అవుతున్నాడు .. ఆ సినిమా పేరే 'భువన విజయమ్'. ఈ రోజునే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ను .. వీడియోను వదిలారు. 

ఈ సినిమాలో 'ఫీలింగ్ స్టార్ ప్రీతమ్ కుమార్'గా సునీల్ కనిపిస్తున్నాడు. స్టార్ హీరోగా ఆయన ఈ కథలో కనిపిస్తాడనే విషయం అర్థమవుతోంది. 6 నెలలుగా రెగ్యులర్ కథలు వినీవినీ బోర్ కొట్టేసిందని ప్రీతమ్ కుమార్ అనడం .. చాలామంది దర్శకులు, రైటర్లు ఆయనకి కథలు వినిపించడం .. చివరికి ఆయన 'భువన విజయమ్' కథను ఎంచుకోవడమనేది ఈ వీడియోలో చూపించారు. 

హిమాలయ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి ఎలమంద చరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. శేఖర్ చంద్ర ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఇతర ముఖ్యమైన పాత్రలలో వెన్నెల కిశోర్ .. శ్రీనివాస రెడ్డి .. పృథ్వీ ..  గోపరాజు రమణ .. వైవా హర్ష కనిపిస్తున్నారు.

Sunil
Vennela Kishore
Srinivasa Reddy
Pruthvi
Bhuvna Vijayam Movie

More Telugu News