Pooja Hegde: 'ఎల్లో'రా శిల్పంలా పూజ హెగ్డే.. లేటెస్ట్ పిక్స్ ఇవిగో!

Pooja Hegde Special

  • యూత్ లో పూజ హెగ్డేకి మంచి క్రేజ్ 
  • భారీ ఫ్లాపులు వచ్చినా కెరియర్ పై పడని ప్రభావం
  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' 
  •  పూజ ఆశలన్నీ ఈ సినిమాపైనే


మంచి హైటూ .. అందుకు తగిన ఆకర్షణీయమైన రూపం పూజ హెగ్డే సొంతం. ఆమె నాజూకుదనానికి కుర్రాళ్లంతా ఫిదా అయ్యారు. తెలుగులో 'దువ్వాడ జగన్నాథం' చేసిన దగ్గర నుంచి కెరియర్ పరంగా ఆమె ఇంతవరకూ వెనుదిరిగి చూసుకున్నది లేదు. ఆ సినిమా నుంచి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఆమె దూసుకుపోయింది. అయితే తన ప్లానింగ్ ప్రకారమే ఆమె 'రాధేశ్యామ్' .. 'బీస్ట్' .. 'ఆచార్య' సినిమాలను ఒప్పుకుంది. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమాలు చాలా తక్కువ గ్యాపులో ఒకదాని తరువాత ఒకటిగా థియేటర్లకు వచ్చాయి. ఆ సినిమాలు ఫ్లాప్ కావడం ఆమెని తీవ్రమైన నిరాశకు గురిచేశాయి. అయినా ఆమె క్రేజ్ కీ .. ప్లేస్ కి ఢోకా లేకపోవడం విశేషం. ప్రస్తుతం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' హిందీ సినిమా పైనే ఆమె ఆశలు పెట్టుకుంది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే పూజ హెగ్డే లేటెస్ట్ పిక్స్ వదిలారు. లెమన్ ఎల్లో కలర్ డ్రెస్ లో ఆమె ఎల్లోరా శిల్పంలా మెరిసిపోతోంది. మత్తుకళ్లతో మనసులను కొల్లగొడుతోంది. స్వీట్ స్మైల్ తో కుర్రాళ్ల గుండె గోడలపై తన పోస్టర్ ను అంటించేస్తోంది.

Pooja Hegde
Actress
Tollywood
  • Loading...

More Telugu News