Simha Koduri: డొక్కు బైక్ నుంచి ఫ్లైట్ వరకూ .. 'ఉస్తాద్' టీజర్ రిలీజ్!

Usthad teaser released

  • 'ఉస్తాద్'గా సింహా కోడూరి 
  • కథానాయికగా కావ్య కల్యాణ్ రామ్
  • దర్శకుడిగా ఫణిదీప్ పరిచయం   
  • పరిస్థితులను, బలహీనతలను జయించిన కుర్రాడి కథ  

కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇవ్వడానికి సింహా కోడూరి తనవంతు ప్రయత్నం చేస్తూ వెళుతున్నాడు. ఆల్రెడీ ఈ కుర్రాడు హీరో కటౌట్ అనిపించుకున్నాడు. ఇక పడాల్సింది హిట్ మాత్రమే. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఉస్తాద్' రెడీ అవుతోంది. వారాహి బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కావ్య కల్యాణ్ రామ్ నటించింది. 

ఫణి దీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రానా చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించారు. హీరోకి చిన్నప్పటి నుంచి విమానాలు అంటే ఇష్టం. ఆకాశంలో ఎగురుతున్న విమానాలను ఆశగా అలా చూస్తుండి పోతుంటాడు. టీనేజ్ లోకి అడుగుపెట్టిన తరువాత అతనికి పైలెట్ కావాలని ఉంటుంది. కానీ పై నుంచి చూస్తే కళ్లు తిరిగే బలహీనత ఆయనకి ఉంటుంది. 

తన ఆర్ధిక పరిస్థితికి తగినట్టుగా ఎప్పుడు చూసినా ఆయన పాత బైక్ పై తిరుగుతూ ఉంటాడు. అలాంటి అతను తన ఆర్ధిక ఇబ్బందులను .. భయాలను .. బలహీనతలను అధిగమించి తన కలను ఎలా నిజం చేసుకున్నాడు? అనేదే కథ. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Simha Koduri
Kavya
Usthad Movie

More Telugu News